అన్న క్యాంటీన్లో భోజన నాణ్యతపై తనిఖీ

అన్న క్యాంటీన్లో భోజన నాణ్యతపై తనిఖీ
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందేనని ఎంపీడీవో విజయలక్ష్మి తెలిపారు.
రాప్తాడు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్‌ను ఎంపీడీవో విజయలక్ష్మి, రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాంటీన్లో అందిస్తున్న భోజనం నాణ్యంగా ఉందని తెలిపారు.
నాణ్యత ప్రమాణాలు ఎక్కడా తగ్గకుండా వంటలు సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, హైవేపై ప్రయాణించే వాహనదారులకు అన్న క్యాంటీన్ భోజనం ఉపయుక్తంగా ఉంటోందన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. విజయకుమారి, డిప్యూటీ ఎంపీడీవోలు అచ్యుతానంద బాబు, బి. అశోక్ బాబు, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.
