అరుదైన పక్షి సంచారం..

అరుదైన పక్షి సంచారం..
- గ్రేటర్ పెయింటెడ్ స్నైప్..
- వన్యప్రాణి పరిశోధకుని కెమెరాకు చిక్కిన ఆ పక్షి..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని చెక్కపల్లి కుంట పరిసర ప్రాంతాలలో అరుదైన పక్షి గ్రేటర్ పెయింటెడ్ స్నైప్ అగుపించింది.ఆ పక్షిని స్థానిక వన్యప్రాణి పరిశోధకుడు,జీవ వైవిధ్య సంరక్షకుడు వెంకటి ఎనగందుల కెమెరాతో చిత్రీకరించారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. ఆ పక్షి చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. భారతదేశం సహా దక్షిణ, ఆగ్నేయా ఆసియాలోని తడి బయళ్లు,మడులు, చెరువులు,వరి పొలాలల్లో నీటి మీద సంచరించే అందమైన పక్షని ఆయన తెలిపారు.

