Inspection Eluru Mla : ఏలూరు ఎమ్మేల్యే అకస్మిక తనిఖీ Andhra Prabha News

Inspection Eluru Mla : ఏలూరు ఎమ్మేల్యే అకస్మిక తనిఖీ Andhra Prabha News
- టిడ్కో ఇళ్ల పనుల పర్యవేక్షణ
- గత పాలకుల చేతగాని తనం
- 4,600 ఇళ్లు రద్దు
- ఇక టిడ్కో ఇళ్లు భ్రష్టు పట్టాయి
- ఎమ్మెల్ఏ బడేటి ఆగ్రహం
- రూ.13.75 కోట్లతో ఆరంతస్తుల టిడ్కో ఇళ్లు రెడీ
- 50 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ కు శంకుస్థాపన
( ఆంధ్ర ప్రభ, ఏలూరు బ్యూరో) .

Inspection Eluru Mla : కూటమి ప్రభుత్వ ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచే టిడ్కో ఇళ్ళకు తుదిరూపునిచ్చే బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇళ్ళ అభివృద్ధిలో జరుగుతోన్న పనే అందుకు ప్రత్యక్ష నిదర్శనమంటూ ఎమ్మెల్యే వెల్లడించారు.

ఏలూరులోని 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ వద్ద చేపట్టిన టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనా పనులు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేయాలనే కూటమి ప్రభుత్వ సత్ సంకల్పానికి టిడ్కో ఇళ్ళు ప్రతిరూపాలని అభివర్ణించారు.
గInspection Eluru Mla : త పాలకు చేతకాని తనం

2014-19 మధ్యకాలంలో వీటి నిర్మాణాన్ని 80శాతం పూర్తిచేయగా, 2019-24 మధ్య గత వైసిపి ప్రభుత్వ పాలనలో టిడ్కో ఇళ్ళ నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి గురై అటకెక్కాయన్నారు. గత వైసిపి ప్రభుత్వ పాలకుల చేతకాని తనం కారణంగా అప్పట్లోనే మంజూరు కావాల్సిన 4వేల 600 ఇళ్ళు రద్దయ్యాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలోని కొత్తూరు ఇందిరమ్మ కాలనీ వద్ద 13కోట్ల, 75లక్షల రూపాయల నిధులతో చేపట్టిన 288 ప్లాట్లతో కూడిన 6టవర్ల టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి తుది రూపునిచ్చేందుకు శ్రమిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే వీటిని లబ్దిదారులకు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, కార్పొరేటర్ యర్రంశెట్టి నాగబాబు,ఈఈ తోట వెంకట నారాయణరావు తదితర కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
