మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుకభరత్, అవుసలోనిపల్లిసర్పంచ్ ఎల్లమ్మ తిమ్మయ్యఅన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఊట్కూర్,అవుసలోనిపల్లి గ్రామాల్లో గ్రామ మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి రూ. 10 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో వివిధ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుందనిఅన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సమైక్య భవనం నిర్మించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ. 10 లక్షలతో సొంత భవనం నిర్మిస్తుందన్నారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధిచెందాలన్నారు.
గ్రామ మహిళా సమైక్య భవనాలు నిర్మించడంతో మహిళలకు వివిధ రకాల శిక్షణలు సమావేశాలు నిర్వహించేందుకు దోహదపడతాయనిఅన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలని మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వపలాలు ఉపయుక్తంగా ఉంటాయనిఅన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏపిఎం హరి నారాయణ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శివలీల, పంచాయతీరాజ్ ఏఈ అజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, మాధురిక తదితరులు పాల్గొన్నారు.
