మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి నిరసన

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మొక్కజొన్న రైతులు ఆగ్రహించారు. మక్కల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. మొక్క జొన్న తూకం వేసే వరకూ మాత్రమే రైతుల బాధ్యత ఉంటుందని అయితే గన్నీ బ్యాగ్స్, సుతిల్ తాడు, మక్కలు ఎత్తడం వంటి పనులు కూడా రైతులే చేయాలంటున్నారని దీనివల్ల తమ డబ్బులు అదనంగా ఖర్చు అవుతున్నాయన్నారు.

అలాగే 50 కిలోల బస్తాకు 600 నుండి 700 గ్రాముల అదనంగా తీసుకోవల్సి ఉంటుంది కానీ ఎక్కువ తూకం వేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు, లైట్లు కూడా ఏర్పాటు చేయాలేదని, మార్క్ ఫెడ్ అధికారులు అందుబాటులో ఉండకుండా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 శాతం మొక్క జొన్న కొనుగోళ్లు జరగలేదని వాపోయారు. వాస్తవంగా ఈ ఖర్చులన్ని కూడా మార్క్ ఫెడ్ అధికారులే భరించాల్సి ఉన్నప్పటికీ ఆ భారం తమపై వేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply