క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ గంగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానం ఆదివారం జరిగింది. కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ డీసీసీబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు గెలిచిన టీమ్స్ కు బహుమతులను అందజేశారు. ప్రధమ బహుమతి యాదగిరిగుట్ట, ద్వితీయ బహుమతి కొలనుపాక టికెట్ జట్లు పొందాయి.
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్,టంగుటూరు సర్పంచ్ జుకంటి అనిల్, గ్రామశాఖ అధ్యక్షులు జంగా స్వామి, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మామిడాల భానుచంధర్, చాడ సురేందర్ రెడ్డి, గంధమల్ల రవి, పర్శ శ్రీశైలం, కుమ్మరిండ్ల ఆంజనేయులు, ఏదునూరి భాస్కర్, ఆర్గనైజర్స్ గంగుల నిఖిల్, సొంటెం ప్రవీణ్, హరీష్ యాదవ్ పాల్గొన్నారు.
