అమాలి కూలీ అనుమానాస్పద మృతి….

అమాలి కూలీ అనుమానాస్పద మృతి….

వత్సవాయి, ఆంధ్రప్రభ : వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన సమాచారం మేరకు బీహార్ కు చెందిన రామకృష్ణ మహతి (42) చిట్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర రా రైస్ మిల్లులో అమాలి కూలిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

ఆదివారం ఉదయం తను కూలి పని చేసుకునే రైస్ మిల్లు సమీపంలో చనిపోయి ఉన్న అతనిని గమనించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించడంతో సంబంధిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా స్థానిక ఎస్సై పి ఉమామహేశ్వరరావు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply