యూత్ కాంగ్రెస్ ధర్నా.. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..

యూత్ కాంగ్రెస్ ధర్నా.. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా నిరసిస్తూ నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు & నాగర్కర్నూల్ ఇన్చార్జ్ బత్తుల అజయ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ నాయక్, టౌన్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, తెలకపల్లిమండల అధ్యక్షుడు మల్లేష్ రెణయ్య, తాడూరు మండల అధ్యక్షుడు మల్లేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యాకర్తలు తదితరులు పాల్గొన్నారు.
