డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా సత్తా..

డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా సత్తా..
మొత్తం జట్టు ఛాంపియన్‌గా…
వ్యక్తిగత మహిళల విభాగంలో యానా జైన్ చాంపియన్..
135 పాయింట్లతో అగ్రస్థానం సాధించిన ఎన్టీఆర్ జిల్లా…
విజేతలను అభినందించిన వీఎంసీ స్విమ్మింగ్ కోచ్‌లు
విజయవాడ, ఆంధ్రప్రభ : కర్నూలులో నిర్వహించిన 12వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ సెలక్షన్ ట్రయల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 135 పాయింట్లు సాధించి ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో యానా జైన్ 35 పాయింట్లు సాధించి ఇండివిడ్యువల్ ఛాంపియన్‌గా నిలిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా స్విమ్మర్లు పలు విభాగాల్లో మెడల్స్ సాధించి జిల్లాకు కీర్తి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమానికి ఏపీఏఏఏ చైర్మన్ కె. రవికాంత్, అధ్యక్షుడు ఎం. ఒబుల్ రెడ్డి, కార్యదర్శి ఏ. మోహన్ వెంకటరామ్, సాప్ పరిశీలకుడు జి. రాజేంద్ర హాజరయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి ఐ. రమేష్ వెల్లడించారు. విజేతలకు వీఎంసీ స్విమ్మింగ్ పూల్ ఇన్‌చార్జి అనిల్, కోచ్‌లు ఎం. మాల్యాద్రి, లక్ష్మణ్ణ, రఫీ అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్స్ సాధించిన క్రీడాకారులతో పాటు వ్యక్తిగత ఛాంపియన్ యానా జైన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
