పేద కుటుంబాలకు అండగా నిలిచిన సేవా కార్యక్రమం…

పేద కుటుంబాలకు అండగా నిలిచిన సేవా కార్యక్రమం…

మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పాయకాపురం, ఆంధ్రప్రభ: పేద మైనార్టీలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కె. నాగుల్ మీరా పాల్గొని రెహమాన్, చాన్ భాష, పీర్ బి అనే మూడు పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

కమిటీ 55వ నెల సేవా కార్యక్రమంలో భాగంగా, కమిటీ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాజిద్ అలీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ కాలేషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మౌలాలి, రాష్ట్ర అధికార ప్రతినిధి సిలార్ బేగ్, నగర ఉపాధ్యక్షులు కరీముల్లా, భాష, మీరావలి, నగర కమిటీ సభ్యులు రషీద్, రఫీ, సెంట్రల్ యూత్ కార్యదర్శి వసీవుల్లా, సెంట్రల్ యూత్ సహాయ కార్యదర్శి నాయబ్ రసూల్, 64వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply