ఆకస్మిక తనిఖీలో బయటపడిన కీలక సూచనలు..!

ఆకస్మిక తనిఖీలో బయటపడిన కీలక సూచనలు..!

పెనుమూరు స్టేషన్‌పై డీఎస్పీ దృష్టి

చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌భ : చిత్తూరు సబ్‌డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ ఆదివారం పెనుమూరు పోలీస్‌ స్టేషన్‌ను సాధారణ తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌ పరిసరాలు, రికార్డులు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

స్టేషన్‌ సిబ్బందితో సమావేశమైన ఆయన, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, ఫిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో విని త్వరితగతిన స్పందించాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా పనిచేయాలని స్పష్టం చేశారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్‌లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని తెలిపారు.

గ్రామస్థాయిలో చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని డీఎస్పీ ఆదేశించారు. స్టేషన్‌ రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని కూడా సూచించారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply