Forjune2026 | జూన్ దర్శన టికెట్లు విడుదల

Forjune2026 | జూన్ దర్శన టికెట్లు విడుదల
Forjune2026 | ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం
దర్శనం, ఆర్జిత సేవలు ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం
సులభతరమైన బుకింగ్ ప్రక్రియ అందుబాటులోకి
Forjune2026 | ఆంధ్రప్రభ నంద్యాల బ్యూరో : శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దర్శనం, ఆర్జిత సేవలకు సంబంధించిన జూన్ నెల టికెట్లను దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు విడుదల చేశారు.
భక్తులు ఆన్‌లైన్ ద్వారా స్పర్శ దర్శనం, వివిధ రకాల ఆర్జిత సేవలు, అలాగే వసతి గదులను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. దర్శనాలు, సేవలు, గదుల బుకింగ్ ప్రక్రియను భక్తుల సౌకర్యార్థం సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.

దేవాదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ aptemples.ap.gov.in తో పాటు srisailadevasthanam.org ద్వారా కూడా టికెట్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
జూన్ నెలలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.

