Trump – political-rivals-or-hired-killers I 2405I రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులా?.. కిరాయి హంతుకులా?

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులా?.. కిరాయి హంతుకులా?
అమెరికాతోపాటు ప్ర‌పంచ దేశాల్లో చ‌ర్చ‌
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం
వైట్ హౌస్ వ‌ద్దే ఘ‌ట‌న‌…
నోబుల్ శాంతి బ‌హుమ‌తి కోసం ఆరాట‌ప‌డుతున్న ట్రంప్
ప్ర‌చారం కోస‌మే ఇలాంటివి అవ‌లంభిస్తున్న‌రా?
అమెరికాలో రాజ‌కీయ విబేధాలు కూడా పెరిగాయి
విబేధాలే.. హ‌త్య రాజకీయాల‌కు దారి తీస్తున్నాయా? అనేది చ‌ర్చ‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంతర్జాతీయం : అమెరికా అధ్య‌క్షుడి డోనాల్డ్ ట్రంప్‌పై వ‌రుస జ‌రుగుతున్న హ‌త్యాయ‌త్నాలు రాజ‌కీయ డ్రామా? అమెరికాలో ఉన్న రాజ‌కీయ విబేధాలా? అనేది ఒక చ‌ర్చ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌తా వ‌ల‌యంలో అమెరికా అధ్య‌క్షుడు గానీ, అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి ఉంటారు. అలాంటి వారిపై కాల్పులు జ‌ర‌గ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీస్తుంది. ఒక‌సారి కాదు..ప‌లు మార్లు జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌ల‌తో అమెరికా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌, ఇంటిలిజెన్స్ పై ప‌లు అనుమానాలు క‌లుగుతున్నాయి. అమెరికాలో అత్యంత భ‌ద్ర‌తా వ‌లయంలో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కే ర‌క్ష‌ణ లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ర‌క్ష‌ణ క‌ల్పిస్తార‌ని ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అమెరికాలో రాజ‌కీయ విభేదాలు పెరిగిపోయాయి. హ‌త్య ల‌కు రాజ‌కీయ విభేదాలు దారితీస్తున్నాయా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది.

Trump – political-rivals-or-hired-killers ఇదీ సంఘ‌ట‌న‌
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 3.30 గంటలకు కాల్పుల ఘటన కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనంలో ఉన్న సమయంలో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఓ సాయుధ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే స్పందించిన అమెరికా రహస్య భద్రతా విభాగం అధికారులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితుడు తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందాడు. మరో బాటసారి కూడా గాయపడ్డారు. వైట్ హౌస్ పశ్చిమ వైపు 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ కూడలి సమీపంలోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ లో ?: నాసిర్ బెస్ట్ (21) అనే సాయుధ యువకుడు బ్యాగ్ నుండి తుపాకీ తీసి అక్కడి అధికారులపై కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ బలగాలు వెంటనే ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు మరణించాడు.

గతంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు..

  • జులై 13, 2024 : పెన్సిల్వేనియా ర్యాలీలో స్టేజీపై ప్ర‌సంగిస్తుండగా డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జ‌రిగాయి. సమీపంలోని భవనం పైకప్పు మీద నుంచి 20 ఏళ్ల యువకుడు థామస్ క్రూక్స్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని గుచ్చుకుని వెళ్లింది. ఒక ప్రేక్షకుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు షూటర్‌ను అక్కడికక్కడే కాల్చి చంపారు. అప్ప‌ట్లో అమెరికాలో భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీక్రెట్ సర్వీస్‌పై విచారణ ప్రారంభమైంది.
  • సెప్టెంబర్ 15, 2024 : ఫ్లోరిడా గోల్ఫ్ క్లబ్ లో ట్రంప్ ఆడుతుండ‌గా ర్యాన్ వెస్లీ రౌత్ అనే వ్యక్తి పొదల్లో దాక్కుని రైఫిల్‌తో ఎదురుచూశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అతడిని గమనించి కాల్పులు జరిపాడు. ప‌రారైన ఆ దుండుగుడిని ప‌ట్టుకున్నారు. 2025లో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. 2026లో జీవిత ఖైదు విధించారు. – అక్టోబర్ 2024 : కోచెల్లా ర్యాలీలో ఘటన. ట్రంప్ ర్యాలీకి సమీపంలో ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు తుపాకులు, గుండ్లు, నకిలీ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ ఘటన కూడా ట్రంప్‌పై దాడి యత్నంగా అనుమానించారు.

Trump – political-rivals-or-hired-killers అమెరికా ఇంటిలిజెన్స్ ఫెయిల్‌
అమెరికాలో రెండేళ్లుగా డోనాల్డ్ ట్రంప్‌పై రెండు సార్లు హ‌త్యాయ‌త్నాలు జ‌రిగాయి. మ‌రికొన్ని భ‌ద్ర‌తా ముప్పులు న‌మోద‌య్యాయి. ఘటనలు అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత తీవ్రమైన భద్రతా సంక్షోభాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ దాడుల త‌ర్వాత సీక్రెట్ సర్వీస్ విధానాలు మారాయి. ప్రత్యేక దర్యాప్తు కమిటీలు ఏర్పాటు చేశారు. ట్రంప్ భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఈ సంఘ‌ట‌న‌ల‌పై అమెరికా ఇంటిలిజెన్స్ వైఫ‌ల్యం, సీక్రెట్ స‌ర్వీస్ ప‌ని విధానం లోపాల‌పై అమెరికాలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఆరు నెల‌లుగా వైట్ హౌస్ చుట్టూ తిరుగుతున్నాడ‌ని ఇంటిలిజెన్స్ అంచనా వేసింది. అంటే అమెరికా భద్రతా సంస్థలకు అతని గురించి ముందే సమాచారం ఉండే అవకాశం ఉంది. అయినా అతడు మళ్లీ ఆయుధాలతో వైట్ హౌస్ దగ్గరకు రావడం పెద్ద భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు. స్థానిక పోలీసులతో సమన్వయం లేకపోవడం, సరైన ప్రాంత తనిఖీలు చేయకపోవడం, హెచ్చరికలను పట్టించుకోకపోవడం ఇలాంటి కార‌ణాలు ఎన్నో ఉన్నాయి.

Trump – political-rivals-or-hired-killers అమెరికా ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
“అమెరికా అధ్యక్షుడిని కూడా కాపాడలేకపోతే సాధారణ ప్రజల భద్రత ఎలా?” అని అమెరికాలోని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అగ్ర‌రాజ్య అధినేత‌కు ప్ర‌పంచంలో లేని విధంగా భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తారు. ఏ దేశం ప‌ర్య‌టించినా అధ్య‌క్షుడి భ‌ద్ర‌తా ఆయా దేశాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌ద్ర‌తాను అమెరికా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ప‌ర్య‌వేక్షిస్తుంది. అలాంటి భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ఉన్నా ప‌లుమార్లు హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటే దీనిపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Trump – political-rivals-or-hired-killersఈ ఘటన కేవలం ఒక వ్యక్తి చేసిన దాడి కాదు!
అమెరికాలో జ‌రుగుతున్న అధ్య‌క్షుడిపై, అలాగే అంత‌కుముందు అధ్య‌క్షుడి అభ్య‌ర్థిపై జ‌రిగిన దాడులు కేవంల ఓ వ్య‌క్తి చేసిన దాడి కాద‌ని అమెరికాలోని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అమెరికాలో పెరుగుతున్న రాజకీయ ద్వేషం, సోషల్ మీడియా ప్రభావం, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు, ప్ర‌భుత్వంపై పెరుగుతున్న అప న‌మ్మ‌కం త‌దిత‌ర కార‌ణాలు లేక‌పోలేదు. అమెరికాలో రాజ‌కీయ హింస‌కు ఇది ప్ర‌తిబింబంగా పేర్కొంటున్నారు. అమెరికా ఇప్పుడు తీవ్ర రాజకీయ విభజనలో ఉంది. ఒకవైపు ట్రంప్‌కు బలమైన మద్దతు, మరోవైపు తీవ్ర వ్యతిరేకత. ఈ పరిస్థితి “toxic political culture”గా మారిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Trump – political-rivals-or-hired-killers సోషల్ మీడియా ప్రభావం
ట్రంప్ పై కాల్పులు జ‌రిగిన‌ తర్వాత కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో కుట్ర సిద్ధాంతాలు వ్యాపించాయి. అంటే సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎంతో ఉందో అర్థ‌మ‌వుతున్న‌ది. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం సమాచార వేదిక కాదు . రాజకీయ కోపం, ద్వేషం, కుట్ర సిద్ధాంతాలు వ్యాపించే ప్రధాన కేంద్రంగా మారింది.
సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి. “Deep State కుట్ర” “Secret Service కావాలనే విఫలమైంది” “ఇది రాజకీయ నాటకం” ఇలా ఎన్నో ప్ర‌చారాలు జ‌రిగాయి.

Trump – political-rivals-or-hired-killers మాన‌వ హ‌క్కుల ఉద్య‌మం…
1960 వ సంవ‌త్స‌రం అమెరికాలో మాన‌వ హ‌క్కుల‌ ఉద్యమం ప్రారంభమైంది. నల్లజాతీయులకు సమాన హక్కులు ఇవ్వాలని ఉద్యమాలు జరిగాయి. మైన‌ర్టీ హ‌క్కుల‌కు మ‌ద్ద‌తుగా డెమోక్ర‌టి పార్టీ నిలిచింది. శ్వేత జాతీయులు రిప‌బ్లిక‌న్ పార్టీ వైపు వెళ్లారు. ఇదే అమెరికా రాజకీయ విభజనకు నాంది ప‌లికింది.

1980 తర్వాత రోనాల్డ్ రీగ‌న్ ప్ర‌భుత్వ కాలంలో మతం, గర్భస్రావం, గన్ చట్టాలు, ఎల్ జీబీటీక్యూ హ‌క్కులు, వ‌ల‌స‌లు లాంటివి పెద్ద రాజకీయ యుద్ధాలుగా మారాయి. అమెరికాలో మన జీవన విధానం వెర్సెస్‌ వారి జీవన విధానం అనే స్థాయికి వెళ్లింది.

1990లో రిప‌బ్లిక‌న్ పార్టీ నాయకుడు న్యూట్ గింగ్రిచ్ తీవ్రమైన దాడి రాజకీయాలను తీసుకొచ్చాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సమయంలో ప్రత్యర్థి పార్టీతో సహకారం తగ్గింది. ఇదే స‌మ‌యంలో రెడ్ అమెరికా, బ్లూ అమెరికా అనే విభ‌జ‌న బ‌ల‌ప‌డింది.


2010 తర్వాత వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి. ప్రజలు తమ అభిప్రాయాలకు అనుకూలమైన వార్తలే చూడడం మొదలుపెట్టారు. రాజ‌కీయాల్లో ద్వేషపూరిత కంటెంట్ వేగంగా వ్యాపించింది. దీంతో ఒక పార్టీ వాళ్లు మరో పార్టీ వాళ్లను “దేశానికి ముప్పు”గా చూడటం పెరిగింది.

2016లో డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక రాజ‌కీయ‌ విభజన మరింత పెరిగింది. ఆయనను “దేశాన్ని కాపాడే నాయకుడు”గా చూశారు. కుటుంబాల్లో కూడా రాజకీయ గొడవలు, సోషల్ మీడియా యుద్ధాలు, ఎన్నికలపై అనుమానాలు పెరిగాయి.

2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు అమెరికా కెపిట‌ల్‌ భవనంపై దాడి చేశారు. ఇది అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత షాకింగ్ సంఘటనల్లో ఒకటి. ఈ ఘటన తర్వాత అమెరికా పూర్తిగా రెండు రాజకీయ శిబిరాలుగా విడిపోయింది. రాజ‌కీయ అభిప్రాయ‌భేదాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడు అమెరికాలో సమస్య కేవలం అభిప్రాయ భేదం కాదు. ప్రజలు ప్రత్యర్థి పార్టీని “ఇష్టం లేకపోవడం” అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది.
“వాళ్లు తప్పు” చేశారు అనే స్థాయి నుంచి “వాళ్లు చెడ్డవాళ్లు” అనే స్థాయికి మారింది. అలాగే మీడియా కూడా రెండు భాగాలుగా విడిపోయి వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నాయి.

ఈ రాజ‌కీయ విబేధాలే హ‌త్య రాజ‌కీయాల‌కు దారితీస్తుందా? నోబుల్ శాంతి బ‌హుమ‌తి కోసం ఆరాట ప‌డుతున్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఇలాంటి రాజ‌కీయ డ్రామాల‌కు తెర దించుతున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదీ కూడా చ‌ద‌వండి : వైట్ హౌస్‌లో కాల్పుల క‌ల‌క‌లం