బీజేపీలో చేరిన కృష్ణమోహన్

చల్లపల్లి, ఆంధ్రప్రభ ; చల్లపల్లి మండల ఆర్ ఐ గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఘంటసాల కృష్ణ మోహన్ బీజేపీలో చేరారు. పునాదిపాడు వద్ద జరుగుతున్న ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్.మాధవ్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆయనను చేర్చుకున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్, ఘంటసాల మండల అధ్యక్షులు తాళ్లూరి ఫణి హరిప్రసాద్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

Leave a Reply