కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గణేష్

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ ; తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కొంతం గణేష్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం రాష్ట్ర కార్యదర్శుల జాబితాను ప్రకటించారు.

ఈ సందర్భంగా కొంతం గణేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పార్టీ కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంతో పనిచేస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply