ఈత పండ్లు.. ఆరోగ్యానికి మేలు

ఈత పండ్లు.. ఆరోగ్యానికి మేలు

ప‌ట్ట‌ణాల్లో జోరుగా విక్ర‌యాలు

చిట్యాల, మే 23( ఆంధ్రప్రభ ): ఖర్జూర పండ్లను తలపించేలా, భలే భలే తీయని రుచులతో ఈత పండ్లగెలలు, శనివారం మండల కేంద్రంలోని తాటి వనంలో ప్రత్యక్షమయ్యాయి, పల్లెల్లోవేసవి కాలంలో సహజంగా కాసే ఈత పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, డాక్టర్లు, గీత కార్మికులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా ఎండాకాలంలో ఈత పండ్లు లభిస్తాయన్నారు. వీటిని ‘పేదోడి పండ్లు’ అని కూడా పిలుస్తారు. ఈత పండ్లు ఎండాకాలంలో శరీరానికి తక్షణ శక్తిని అందించి, వేడిని తగ్గిస్తాయి. ఈత పండ్లలో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల పిల్లల ఎదుగుదలకు, ఎముకల పటిష్టతకు సహాయపడతాయి.

ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి, రక్త వృద్ధి జరుగుతుంది. పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. వీటిలోని సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రక్టోజ్) వేసవిలోని అలసటను, నీరసాన్ని దూరం చేస్తాయి. విటమిన్( సి) అధికంగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది. ఈత పండ్లను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు పలువురు తీసుకువెళ్లి విక్రయించడం జరుగుతుందని గీతకార్మికులు బుర్ర రఘు,కట్టగాని నవీన్, లు తెలిపారు.

Leave a Reply