మహాసభలకు త‌ర‌లిరండి

మహాసభలకు త‌ర‌లిరండి

మజ్దూర్ సంఘం నాయకుల పిలుపు

బెల్లంపల్లి, మే23(ఆంధ్రప్రభ): రైల్వేకార్మికులసమస్యలపరిష్కారం కోసం,హక్కుల పరిరక్షణ కు పోరాడుతున్న దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ 56 వ వార్షిక మహాసభల కు పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు తరలి రావాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సి అండ్ డబ్ల్యు ఆర్వోహెచ్ డిపో షెడ్ లో వార్షిక మహాసభల వాల్ పోస్టర్లను శనివారం సంఘం బెల్లంపల్లి బ్రాంచి ఛైర్మెన్ ఎస్ నాగరాజు, సెక్రెటరీ జీ సాంబశివుడువిడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ న వార్షిక మహాసభలు సికింద్రాబాద్ లోనిబోయ గుడా లోగల రైల్వే కళారం ఆడిటోరియంలోజరుగుతాయ
న్నారు.

ఈ మహాసభలకు బెల్లంపల్లి బ్రాంచ్ పరిధిలోని రైల్వే కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతాయనిమహా సభలకు ముఖ్యతిదులు గా రైల్వే మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిశివ గోపాల్ మిశ్రా, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శిసీ హెచ్ శంకర్ రావు,జనరల్ మేనేజర్ సంజయ్, కుమార్ శ్రీ వాస్తవ, లు హాజరౌ తారని వారు తెలిపారు. ఈ మహాసభల్లో రైల్వే కార్మికుల ప్రధాన సమస్యల పై జాతీయ నాయకులు ప్రసంగించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ,,69 వేలుఇవ్వాలని,ఇతర కోర్కెలను8వ వేతనం సంఘం ఆమోదించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్రాక్ మెయింటెనర్ల కేటగిరీలో గ్రేడ్ – IV నుండి గ్రేడ్ – 1 వరకు రూ,, 83,200 లు వేతనం ఇవ్వాలని ట్రాక్ మెయింటేనేన్స్ కేటగిరిల్లోరూ,,1,12,000,రూ,,1,35,700 లు, రూ,,1,82,500/- రూ.లను కనీస వేతనాలుగా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డైరెక్టు రిక్రూట్మెంట్లో 10 శాతం తగ్గించి ఎల్ డీ సీ కై అందరికి అవకాశం కల్పించా లని వారు డిమాండ్ చేశారు. ఇంటి అద్దె అలవెన్సును ‘ఎక్స్ ‘ క్లాస్ సిటీకి 40% ‘వై’ క్లాస్ సిటీకి 35శాతం, జెడ్ ‘ క్లాస్ సిటీకి 30శాతం వర్తింప చేయాలని సంఘం జాతీయ నాయకులు కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెస్తారన్నారు.

పెరిగిన పని భారానికి తగ్గట్టుగా క్రొత్త పోస్టులను మంజూరు చేయాలని. ప్రతి ఏటా 2 శాతం పోస్టులను రద్దు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

ఎడ్యుకేషననల్ అలవెన్సును పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అనుమతించాలని, రెండు షిఫ్ట్ లను ప్రవేశపెట్టి ట్రాక్ మెయింటెనర్లకు పని భారం తగ్గించాలి, పెట్రోలింగ్ డ్యూటీకై ఇద్దరు ట్రాక్ మెయింటెనర్లను పంపాలని . మహిళా ఉద్యోగినులకు వేరే కేటగిరీలలోకి మారే అవకాశం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

మెడికల్ డిపార్ట్మెంట్లోని అన్ని కేటగిరీలకు నోడల్ మినిస్ట్రీ అనగా భారత ప్రభుత్వం యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని కేటగిరీల మాదిరిగా వేతన స్కేళ్లను ఆ అమలు చేయాలని.

అందరు మహిళా ఉద్యోగినులకు ఇతర కేటగిరీలలోకి మారేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీ అండ్ డబ్ల్యూ,ఆర్ఓహెచ్ డిపో షెడ్ల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply