అభివృద్ధి పనులకు శ్రీకారం

మదన్ హిప్పర్గలో ఐకేపీ భవనం, రోడ్డు పనులకు భూమిపూజ
గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

డోంగ్లి, మే23(ఆంధ్రప్రభ) : మండలంలోని మదన్ హిప్పర్గ గ్రామంలో శుక్రవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతన ఐకేపీ భవన నిర్మాణానికి భూమిపూజ, నూతన గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం నిర్వహించారు. అదేవిధంగా మదన్ హిప్పర్గ నుండి సిర్పూర్ వెళ్లే రహదారి పూడిక పనులకు భూమిపూజ చేశారు.ఈకార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా సర్పంచ్ లక్ష్మణ్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

సర్పంచ్ లక్ష్మణ్‌కు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు,ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి, సీనియర్ నాయకులు అడ్వ.బస్వరాజ్ పటేల్, భాస్కర్ రెడ్డి,డిసిసి ఉపాధ్యక్షుడు యూనుస్ పటేల్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,మాజీ ఎంపిటిసి దీన్ దయాల్,సర్పంచ్ లు బస్వరాజ్ పటేల్, శ్రీధర్,శ్రీకాంత్,నాయకులు చాంద్ పటేల్, శివ రెడ్డి, విలాస్ గైక్వాడ్, అప్సర్,స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply