AP Deputy CM | చిరు 158 ఆరంభం..

AP Deputy CM | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపొందే సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ భారీ, క్రేజీ మూవీ ఈరోజు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

AP Deputy CM

చిరు, బాబీ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో చిరు, బాబీ చేస్తున్న తాజా సినిమా పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో చిరును బాబీ సరికొత్తగా చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

AP Deputy CM

ఈ ప్రారంభోత్సవానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ కలిసి ఓకే కారులో రావడం విశేషం. మెగాస్టార్ పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి పవర్ స్టార్ క్లాప్ ఇచ్చారు. మెగా డాటర్ సుస్మిత స్విఛ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయిక ఎవరు అనేది ప్రకటించలేదు కానీ.. కాజల్ నటించనుందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.