Knight Riders | ముంబైని బ్యాటింగ్‌కు దించిన కేకేఆర్!

Knight Riders | ముంబైని బ్యాటింగ్‌కు దించిన కేకేఆర్!

Knight Riders | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరిత పోరులో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ క్యాప్టెన్‌ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చినట్లు ధృవీకరించారు. ఆయనతో పాటు అల్లా గజన్‌ఫర్ కూడా జట్టులోకి వచ్చారు.

సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టుకు కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచే అవకాశం ఉండటం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌ ఈ మ్యాచ్‌ తప్పకుండా గెలవాల్సిందే.