mobile scam alert | ముందుగా ఈ ప్రమాదం తెలుసుకోండి! నిమ్మనపల్లిలో స్కామ్‌ను అడ్డుకున్న సర్పంచ్!

mobile scam alert | ముందుగా ఈ ప్రమాదం తెలుసుకోండి! నిమ్మనపల్లిలో స్కామ్‌ను అడ్డుకున్న సర్పంచ్!

mobile scam alert | నిమ్మనపల్లిలో అనుమానాస్పద మొబైల్ సేకరణ కలకలం
సర్పంచ్ అప్రమత్తంతో బయటపడిన స్కామ్ అనుమానం
పాత ఫోన్లతో నేరాల ప్రమాదమంటున్న గ్రామ పెద్దలు
ప్లాస్టిక్ వస్తువుల ఆశలో మోసపోవద్దని హెచ్చరిక
పాత మొబైల్స్ అమ్మే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

పెద్దపల్లి రూరల్: మీ ఊరిలో, పట్టణంలో పాత, ఖరాబైన మొబైల్ ఫోన్లు కొంటాం…” అంటూ ఇంటింటికీ తిరిగే వారిని నమ్మి మోసపోవద్దని, ఎవరూ పాత ఫోన్లను అమ్మవద్దని పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్ హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్లను సేకరించి వాటితో నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

mobile scam alert
mobile scam alert

నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఇంటింటికీ తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తీసుకుని, వాటికి బదులుగా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్న కొందరు వ్యక్తులను సర్పంచ్ రమేష్ పట్టుకున్నారు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించి, సదరు వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తులను విచారించి, అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

ఇది పెద్ద స్కామ్ – సర్పంచ్ రమేష్

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాలలో వాడవాడకూ తిరుగుతూ పాత మొబైల్స్ తీసుకొని ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని అన్నారు. పాత మొబైల్స్ ఎవరూ ఇవ్వకూడదని, వాటి వల్ల గ్రామాలలో నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి వారిని అస్సలు నమ్మకూడదని, వారిని గ్రామాల్లోకి కూడా రానీయకూడదని సర్పంచ్ స్పష్టం చేశారు.

జనం జర జాగ్రత్త!

చూశారుగా జనం.. జర జాగ్రత్త! పనికిరాని ఫోనే కదా, ఏదో ఒక ప్లాస్టిక్ వస్తువు వస్తుంది కదా అని ఆశపడి పాత ఫోన్లను అమ్మితే, రేపు పొద్దున తెలియకుండానే నేరాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందట. కాబట్టి పాత మొబైల్స్ అమ్మేటప్పుడు జర జాగ్రత్త సుమా!

click here to read more

click here to read భారీ మొత్తంలో బంగారం, మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం