మెడికల్ షాప్స్ బంద్

తొర్రూరు డివిజన్ కేంద్రంలో మూసివేత
తొర్రూరు టౌన్ మే 20 ఆంధ్రప్రభ : డివిజన్ కేంద్రంలో బుధవారం మెడికల్ షాపులు పూర్తిస్థాయిలో బంద్ పాటించాయి . ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాదాలపల్లి వేణుగోపాల్ దామెర సరేష్ లు మాట్లాడుతూ ఆల్ ఇండియా కెమిస్ట్ ట్రస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో ఉన్న సుమారు 50 పైలా ఉన్న మెడికల్ షాపులు పెట్టామని అన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు చేపట్ట రాదని దేశంలో ఉన్న ఉన్నత స్థాయి మల్టీనేషన్ కంపెనీ ఫార్మసీ వారు అధిక శాతం రాయితీలు ఇవ్వడం వలన తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వెంటనే ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని కోరారు
