Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య తీసుకోండి..

Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య తీసుకోండి..

జనగామ సిఐ కి ఫిర్యాదు చేసిన ఒకటో వార్డు అభ్యర్థి కూరాకుల శ్రీలత

Bjp l జనగామ, ఆంధ్రప్రభః జనగామ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నా తమపై బీఆర్ఎస్ గుండాలు చెప్పులతో దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి అభ్యర్థి కూరాకుల శ్రీలత కోరారు. ఆదివారం ఈ మేరకు జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం బిజెపి నాయకులతో కలిసి మాట్లాడుతూ ఒకటో వార్డులో బిజెపి పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఓడిపోతమన్న భయంతో బిఆర్ఎస్ గుండాలు తమ ప్రచారంపై చెప్పులతో దాడి చేసి , మహిళా అన్న గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యతమయ్యారు.

జిల్లా కేంద్రంలో గతి పది సంవత్సరాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డ బిఆర్ఎస్ నాయకులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి దోపిడి చేయాలని భావిస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై ఇలా దాడులకు దిగుతున్నారని వారు ఆరోపించారు. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత విషయాలపై వారు దూషించడం ఏమిటని వారు ప్రశ్నించారు. తమపై అకారణంగా దాడికి పాల్పడ్డ బిఆర్ఎస్ గుండాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని ఒకటో వార్డు అభ్యర్థి కూరాకుల శ్రీలత కోరారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply