570 results | ఎమ్మెల్యే చింతమనేని భరోసా

570 results | ఎమ్మెల్యే చింతమనేని భరోసా
More than 570 results | ఏలూరుబ్యూరో, ఆంధ్రప్రభ : దెందులూరు నియోజకవర్గంలో విద్యా విప్లవానికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తాము నిరంతరం కట్టుబడి ఉన్నామని దెందులూరు శాసనసభ్యులు, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి అటానమస్ కళాశాల ఆడిటోరియంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల “విద్యా విజయోత్సవ సభ” అత్యంత వైభవంగా జరిగింది. నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సత్కరించారు.
570 results | ఆర్థిక సహాయం అందుకున్న టాపర్స్…

పదో తరగతి ఫలితాల్లో 570కి పైగా అత్యుత్తమ మార్కులు సాధించి నియోజకవర్గానికి పేరు తెచ్చిన ఆరుగురు విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా నిలుస్తూ, చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక్కొక్కరికి రూ. 25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) చొప్పున నగదు పురస్కారాన్ని ఎమ్మెల్యే అందజేశారు.
570 results | ఆర్థిక సాయం అందుకున్న విద్యార్థుల వివరాలు……

1.ఐ. ధవళేశ్వరి (575 మార్కులు) – జెడ్పీ హైస్కూల్, విజయరాయి (పెదవేగి మండలం)
2.కొండపల్లి నితిన్ (575 మార్కులు)- ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గోపన్నపాలెం (దెందులూరు..మండలం)
3.బి.రేవతి (573 మార్కులు)- జెడ్పీ హైస్కూల్, అప్పన్నవీడు (పెదపాడు మండలం)
4.బి.కిరణ్ కుమార్ (573 మార్కులు)- జెడ్పీ హైస్కూల్, పెదపాడు (పెదపాడు మండలం)
5.గోళ్ళ పూజ (573 మార్కులు)- జెడ్పీ హైస్కూల్, కొవ్వలి (దెందులూరు మండలం)
6.ఈర్ల ప్రవల్లిక (548 మార్కులు)- జెడ్పీ హైస్కూల్, పెదవేగి. (ఈ విద్యార్థిని తండ్రి లేరు, తల్లి శ్రామికురాలు. గతంలో ఇచ్చిన హామీ మేరకు, మార్కులు 570 రాకపోయినా ఆమె కుటుంబ పరిస్థితిని బట్టి ఉన్నత చదువుల కోసం ఎమ్మెల్యే ప్రత్యేకంగా రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేసి పెద్దమనసు చాటుకున్నారు).

అలాగే నియోజకవర్గ పరిధిలోని 37 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన 74 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదికపై ప్రత్యేకంగా సత్కరించి మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా పదో తరగతి పాసైన వారిలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు, సింగిల్ పేరెంట్ (తల్లి లేదా తండ్రి మాత్రమే) ఉన్న విద్యార్థుల ఉన్నత చదువులకు సైతం తన వంతుగా పూర్తి అండగా ఉంటానని ఎమ్మెల్యే భావోద్వేగ భరోసా ఇచ్చారు.
570 results | మాటల్లో కాదు, ఆచరణలో చూపించా-ఎమ్మెల్యే చింతమనేని..

సభలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. “రాష్ట్రంలో ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పం. ప్రభుత్వ విద్యా విధానంపై ప్రజల్లో నమ్మకం పెంచడానికి నేను ఎమ్మెల్యేగా ఉండి కూడా నా కుమారుడిని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు దుగ్గిరాలలోని ప్రభుత్వ పాఠశాల లోనే చదివించాను. నేను ఆచరణలో చేసి చూపించా. ఇదే రీతిలో యువ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి సమాజానికి ఆదర్శంగా నిలవాలి” అని పిలుపునిచ్చారు.
570 results | కూటమి ప్రభుత్వ సంస్కరణలు-విద్యామిత్ర కిట్లు…
“గతంలో నేను 2009 నుండి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఏటా సొంతంగా 30 వేల మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసేవాడిని. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపిల కూటమి ప్రభుత్వంలో, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, యూనిఫామ్స్ అన్ని కలిపి ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు’ రూపంలో ఒకేసారి అందించడం ఎంతో అభినందనీయం” అని కొనియాడారు.
570 results | పాఠశాలల మౌలిక వసతులకు ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్స్…
నియోజకవర్గంలోని స్కూళ్ల అభివృద్ధిపై అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. “ఈ వేసవి సెలవుల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. స్కూల్ గేటు నుండి క్లాస్ రూమ్ వరకు సిమెంట్ (సి.సి) రోడ్డు లేదా బిటి రోడ్డు ఉండాలి. పెదవేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ పెదవేగి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులు కోసం వాష్ రూమ్ వరకు సీసీ రోడ్డు వేయించిన విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి స్కూల్లో టాయిలెట్లు, మౌలిక సదుపాయాలు ఉండాలి. ఎక్కడ ఏ లోపం ఉన్నా ఈ సెలవుల్లోనే పునర్నిర్మాణ పనులు పూర్తి కావాలి. జూన్ లో స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు సమస్యలు లేని సరికొత్త వాతావరణం కనిపించాలి. దీనికోసం ఇప్పటికే అనేక నిధులను మంజూరు చేయించాను” అని వెల్లడించారు.
ఉపాధ్యాయులకు విజ్ఞప్తి – ‘తల్లికి వందనం……
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘తల్లికి వందనం’ పథకం అర్హులైన ప్రతి తల్లికీ చేరేలా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే, “పేదరికంలో ఉండి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఫీజులు లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి ఇళ్లల్లో పనులకు లేదా కూలి పనులకు వెళ్లకుండా ప్రధానోపాధ్యాయులు (హెచ్.ఎమ్) వారి క్షేమ సమాచారాలను పర్యవేక్షించాలి. అలాంటి పిల్లలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అని తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారు సప్లిమెంటరీలో పాసై ఇదే విద్యా సంవత్సరంలో ముందడుగు వేసేలా చూడాలన్నారు. రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం) నాడు దెందులూరు నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని వారి కుటుంబ సమేతంగా ఘనంగా సత్కరిస్తామని ప్రకటించారు.
లక్ష్యం -2027 లో దెందులూరు నెం.1…..
రాబోయే 2027 పదవ తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా మొత్తంలో దెందులూరు నియోజకవర్గం ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు, అధికారులు ఇప్పటి నుంచే కష్టపడాలని పిలుపునిచ్చారు. “ప్రతి వైఫల్యం విజయానికి నాంది. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయాలు ఇలా ఏ రంగంలో అయినా వైఫల్యం చెందని వ్యక్తి ఉండడు. ప్రధాని మోదీ ‘వికసిత భారత్’, సీఎం చంద్రబాబు ‘విజన్ 2047’ లక్ష్యాల దిశగా మన విద్యార్థులు ఎదగాలి. రాబోయే రోజుల్లో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక ప్రగతికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం” అని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు..
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని వెంకట లక్ష్మమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుధా, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రస్ట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ ఉప్పలపాటి రాంప్రసాద్ , చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ చింతమనేని నవ్యశ్రీ, మురళి మాస్టర్, సహా పలువురు మండల పార్టీల అధ్యక్షులు, సొసైటీల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, నియోజకవర్గ పరిధిలోని తాసిల్దారులు, ఎంపీడీవోలు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల అధ్యాపక సిబ్బంది, సహా వివిధ శాఖల అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
