కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగన్నకు ఘన సన్మానం

కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన బొడ్డు గంగన్నను మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ భూషణ్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సతీష్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బి. దేవేందర్ గౌడ్, ఆర్టీఏ సభ్యుడు మల్లేష్ యాదవ్, దస్తురాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్. రమేష్‌రావు, యువజన జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్, కడెం టౌన్ అధ్యక్షుడు వాజీద్, డీసీసీ సభ్యుడు గొల్ల వెంకటేష్ పాల్గొన్నారు.

అలాగే ఎలగడప, బెల్లాల్ గ్రామాల సర్పంచులు ఈదుల తిరుపతి, నర్సింగ్, అశ్విత రమేష్, నాయకులు కొండాపురం లక్ష్మణ్, సలీమ్, బబ్లు, రాజేశ్వర్, భూమ రాజం తదితరులు పాల్గొని బొడ్డు గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply