పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఆత్మస్థైర్యం, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ఎంతో మంది దివ్యాంగులు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సంజీవ్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాశాఖ సమగ్ర శిక్ష, ఆల్మికో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు వినికిడి పరికరాలను, వీల్ చైర్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నిర్మలజగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు సంగీత‌ మహేష్, యశోద, విద్యాశాఖ అధికారి ఎస్‌.వెంక‌టేశ్వ‌ర్లు, సర్వ శిక్ష అభియాన్ ఏఎంఓ బాలయ్య, సీఎంఓ ఎ.భీంగొండ, సీఓ-1 తాజుద్దీన్, జిల్లా ఐఈఆర్పీలు విజయచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.