స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రజావాణికి విశేష స్పందన

స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రజావాణికి విశేష స్పందన

  • ఆర్డీవో కార్యాలయంలో 33 దరఖాస్తుల స్వీకరణ
  • భూమి, రెవెన్యూ, సంక్షేమ సమస్యలపై వినతులు
  • సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి ఆదేశాలు
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • ప్రతి ఫిర్యాదుపై త్వరిత చర్యలు తీసుకుంటాం
  • స్టేషన్ ఘన్ పూర్ తహసీల్దార్ స్వప్న

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సోమవారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యా లయం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 33 దర ఖాస్తులు స్వీకరించిన్నట్లు తహసీల్దార్ డి.స్వప్న పేర్కొన్నారు. ఈ సంద ర్బంగా భూమి, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, ఇతర ప్రజా సమస్య లకు సంబంధించిన వినతిపత్రాలను ప్రజలు సమర్పించారు.

అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా విన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు పంపించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధింత అధికారులను తహసీల్దార్ ఆదే శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి ఫిర్యా దును పరిశీలించి త్వరిత గతిన పరిష్కారం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.