solid plan | అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్

solid plan | అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్

solid plan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన జంట హత్యల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని నిందితులు పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితురాలు కరీమా బేగం దంపతులు మొత్తం ఎనిమిది మందిని హత్య చేయాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.

పోలీసుల విచారణలో భాగంగా.. ప్లాన్ చేసిన ఎనిమిది మందిలో ఇద్దరిని ఇప్పటికే కరీమా బేగం దంపతులు హత్య చేసినట్లు బయటపడింది. అప్పు వ్యవహారాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఇంకా మరో ఆరుగురిని కూడా ఫామ్‌హౌస్‌కు పిలిచి హత్య చేయాలని నిందితులు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే వారు అక్కడికి వెళ్లకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరు మహిళల హత్య వెలుగులోకి రావడంతో మిగిలిన రుణదాతలు అప్రమత్తమైనట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.