ప్రతిభకు ప్రశంసా పత్రం

ప్రతిభకు ప్రశంసా పత్రం


తిరుమలగిరి, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో విద్యా వారోత్సవాలలో భాగంగా పదవ తరగతి వార్షిక ఫలితాలలో మున్సిపాలిటీ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అక్కల సాయి చరణ్ 581 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించడంతో జిల్లా కలెక్టర్ తేజస్ నందా లాల్ పవార్ చేతుల మీదుగా పది వేలు నగదు బహుమతి, శాలువా, మెమెంటోతో సత్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థి పాఠశాలల్లో జరుగుతున్న విద్యాబోధన అభివృద్ధి కార్యక్రమాలు కలిగి ఉన్న వసతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అశోక్, మండల ఎంఈఓ శాంతయ్య, ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, ఉపాధ్యాయులు జానయ్య, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply