Russia Ukraine war | రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం

Russia Ukraine war | రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం

Russia Ukraine war | మాస్కోపై భారీ డ్రోన్ దాడి
భారతీయ కార్మికుడి మృతి కలకలం
విమానాశ్రయాల్లో ఆటంకాలు
డ్రోన్ల యుద్ధంతో భయాందోళనలు

Russia Ukraine war | మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడిలో ఒక భారతీయ కార్మికుడుతో సహా నలుగురు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ ఘటన రష్యాలోని మాస్కో ప్రాంతంలో ఆదివారం జరిగింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.

ఉక్రెయిన్ ఈ సంవత్సరంలో అతి పెద్ద డ్రోన్ దాడిని చేసింది. దాదాపు వేయికి పైగా డ్రోన్లు రష్యా వైపు పంపించారు. మాస్కో నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నాయి. మాస్కో ప్రాంతంలో ముగ్గురు మరణించగా, బెల్గారోడ్ ప్రాంతంలో ఒకరు చనిపోయారు. మొత్తం 12 మంది గాయపడ్డారు.

భారత రాయబార కార్యాలయం అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, గాయపడిన కార్మికులను ఆసుపత్రిలో కలిసి సహాయం అందించారు. మృతుడి గుర్తింపు ఇంకా వెల్లడి కాలేదు. కంపెనీ నిర్వాహకులు, స్థానిక అధికారులతో కలిసి మృతుడి కుటుంబానికి అన్ని సహాయాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను రష్యా కీవ్‌పై ఇటీవల జరిపిన భారీ దాడికి ప్రతిస్పందనగా అభివర్ణించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్కువ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపింది. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ 81 డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించారు.

డ్రోన్ శకలాలు మాస్కో ఆయిల్ రిఫైనరీ సమీపంలో పడ్డాయి. అయితే రిఫైనరీ సాధారణంగానే పని చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ దాడి తర్వాత మాస్కో విమానాశ్రయాల్లో కొంతసేపు ఆటంకాలు ఏర్పడ్డాయి. రష్యా ఈ దాడులను ‘మాస్ టెర్రర్ అటాక్’గా ఖండించింది.

భారతీయుల భద్రత కోసం రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇదే సమయంలో రష్యా కూడా ఉక్రెయిన్‌పై భారీగా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడిలో మొత్తం 300 డ్రోన్లను ఉపయోగించింది. షాహిద్ రకం డ్రోన్లు, జెట్ శక్తి కలిగిన గెర్బెరా, ఇటాల్మాస్, పరోడియా రకం మోసపూరిత డ్రోన్లను వినియోగించారు.

ఉక్రెయిన్లోని 24 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకారం 269 డ్రోన్లను కూల్చివేయడం లేదా అడ్డుకోవడం జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్‌పై ఇటీవల రోజుల్లో జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచింది. రష్యా ఈ వారం మొత్తం వేయికి పైగా డ్రోన్లు, క్షిపణులు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

Leave a Reply