222 runs | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోనే..!

222 runs | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోనే..!
222 runs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఒకవైపు పరాజయాలతో సతమతమవుతుంటే, మరోవైపు బౌలింగ్‌లో అత్యంత ఘోరమైన ప్రదర్శనతో ఒకదాని తర్వాత ఒకటి అన్వాంటెడ్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు 222 పరుగులు చేయడంతో.. పంజాబ్ కింగ్స్ పేరిట ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత చెత్త రికార్డు నమోదైంది.
ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక సీజన్లో అత్యధిక సార్లు (9 సార్లు) 200 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న ఏకైక జట్టుగా పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సీజన్లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు పంజాబ్ బౌలర్లను టార్గెట్ చేస్తూ వరుసగా భారీ స్కోర్లు బాదారు.
పంజాబ్ కింగ్స్ బౌలింగ్ వైఫల్యం కేవలం ఈ సీజన్‌కే పరిమితం కాలేదు. మొత్తంగా మెన్స్ టీ20 క్రికెట్ (ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి) చరిత్రలోనే అత్యధికంగా 46 సార్లు 200 ప్లస్ రన్స్ ఇచ్చిన జట్టుగా పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట కూడా ఒక నిరాశాజనకమైన రికార్డు నమోదైంది. ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్లకు 200 ప్లస్ స్కోర్లు ఇచ్చిన కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచారు.
