ఒకటి”రెండు… ఉగ్గ బట్టుకొని ఉండు!

ఒకటి”రెండు… ఉగ్గ బట్టుకొని ఉండు!
కలెక్టరేట్లో చాలీచాలని మరుగుదొడ్లు..
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టరేట్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఉద్యోగులు. సిబ్బందికి కనీస సౌకర్యాలు అందుబాటులో లేవు. కలెక్టరేట్లో వివిధ విభాగాలు చెందిన 2000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.. మహిళలకు 3 పురుషులకు. 3 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. ఉద్యోగులకు సరిపడా మరుగుదొడ్లు లేక అత్యవసరమైనప్పుడు ఉగ్గ బట్టుకొని ఉండాల్సి వస్తుందని. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న మరుగుదొడ్ల నిర్వహణ లేక కంపు కొడుతున్నాయి.. వీటిలోకి ముక్కు మూసుకొని వెళుతున్నారు.

పైపులు విరిగిపోయిన. నీటి సరఫరా సరిగా లేక పోయిన పట్టించుకోవడంలేదని సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు లోకి వెళ్లలేక ఆరు బయట ఉన్న తుప్పల్లోకి వెళ్లి కాలకృత్తాలు తీర్చుకుంటున్నారు. కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు తమ శాఖ సిబ్బంది మాత్రమే మరుగుదొడ్లు వాడుకునే విధంగా తాళాలు వేసి. తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఫలితంగా ఉన్న7 మరుగుదొడ్లలో 4 మాత్రమే వినియోగించు కోవాల్సి వస్తుంది. మహిళా ఉద్యోగుల కష్టాలు వర్ణ నాతీతం. ఉద్యోగులు సిబ్బందికి సరి ప డా మరుగుదొడ్లు నిర్మించాలని. పలుమార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సభలు సమావేశాలు జరిగినప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీల పాటు కార్పొరేషన్ చైర్మన్లు కూటమి నాయకులు ఎక్కువమంది వస్తుంటారు ఈ సమయంలో మరుగుదొడ్లకు డిమాండ్ పెరుగుతుంది. వారి వెంట వచ్చిన సిబ్బంది నాయకులు మరుగుకు ఆరు బయటకు పరిగెట్టాల్సి వస్తుంది. ప్రతి సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించే పి జి ఆర్ ఎస్ రెవిన్యూ క్లినిక్ లకు జిల్లా అధికారులు హాజరవుతారు. సునయన ఆడిటోరియం బయట ఉన్న మరుగుదొడ్లు లో నీటి సమస్య కారణంగా పలువురు ఉగ్గబెట్టుకొని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కలెక్టరేట్లో జరిగే సమీక్ష సమావేశాలకు అధికారులు, తమ వెంట వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నారు.

కలెక్టరేట్లో అధికారి యంత్రాంగానికి. సరైన సౌకర్యాలు కల్పించడంలో. అడుగడుగునా నిర్లక్ష్యంగానే ఉంది. అధికారులు మరుగుదొడ్లకు వెళ్లి. ముక్కు మూసుకొని వస్తున్నారు. పి జి ఆర్ ఎస్. సమీక్ష సమావేశాలు. ఇతరత్రా కార్యక్రమాలకు సునయన ఆడిటోరియం కు రావాలంటే కాలకృత్తాలు ఉగ్గ పెట్టుకుని పరిస్థితి ఉంది.. ఇంకెంత కాలానికి సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూస్తున్నారు.
స్థలం ఉన్న కానరాని నిర్మాణాలు…
కలెక్టరేట్ కార్యాలయాల్లో వ్యవసాయం, విద్య, రెవిన్యూ, ఐసిడిఎస్, అనుబంధ శాఖలతోపాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ.. కోపరేటివ్, నేషనల్ హైవే, శాఖలలో స్థలం ఉన్న వీటి ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. అత్యంత ముఖ్యంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఆ కార్యాలయ ప్రాంగణంలో మరుగుదొడ్లు ఉన్న. భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు. నీటి వసతి లేదు. ఆరు బయటకు పరిగెట్టాల్సి వస్తుంది. స్వచ్ఛ భారత్ లో భాగంగా మరుగు దొడ్లు నిర్మించుకుని బహిరంగ మల విసర్జనకు చరమగీతం పాడాలని చెప్పుకొస్తున్న అధికారులు. కలెక్టరేట్ లో మాత్రం వీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు.
