సీఐ మహేందర్‌ను సన్మానించిన బీఆర్ఎస్ యూత్ నాయకులు

సీఐ మహేందర్‌ను సన్మానించిన బీఆర్ఎస్ యూత్ నాయకులు
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి పోలీస్ స్టేషన్ కు నూతనంగా విచ్చేసిన సీఐ ఎ మహేందర్ ను బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈమేరకు సీఐకి పూల బోకేను అందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ ఏ సమస్యనైనా తక్షణమే తన దృష్టికి తీసుక వచ్చినట్లైతే,పరిష్కారానికి కృషి చేస్తానని యూత్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు బొర్ర సురేష్, చిట్యాల కమలాకర్, మంద క్రాంతి కుమార్, మద్దెల తిరుపతి, వస్కుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
