AP Police Department | 75 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీగా అవకాశం

AP Police Department | 75 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీగా అవకాశం

AP Police Department | 31 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీ పదోన్నతి
స్క్రీనింగ్ కమిటీ ఆమోదించిన ప్యానెల్ జాబితా
సర్వీస్ రికార్డుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ
అసిస్టెంట్ కమాండెంట్ల పదోన్నతులకూ ప్రతిపాదనలు

AP Police Department | అమరావతి, ఆంధ్రప్రభ : 2025-26 ప్యానెల్ సంవత్సరానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాన్-కేడర్) కేటగిరీకి పదోన్నతికి అర్హులుగా 31 మంది అదనపు ఎస్పీల జాబితాను పోలీసుశాఖ సిద్ధం చేసింది. డీజీపీ కార్యాలయం నుంచి వెళ్లిన ఈ ప్రతిపాదనలకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ చోట్ల అదనపు ఎస్పీలుగా పని చేస్తున్న 31 మందిని సీనియార్టీ ప్రకారం నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించేందుకు కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

పోలీసు శాఖలో ప్రమోషన్లు

• 31 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి
• 75 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్
• ప్యానెల్ జాబితాకు స్క్రీనింగ్ కమిటీ ఆమోదం

కమిటీ సీనియారిటీ జాబితాలోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) ఏసీఆర్లు, సంబంధిత రికార్డులు, ఇతర కీలక పత్రాలను, క్రమశిక్షణా కేసులతో సహా పరిశీలించి, వారి సర్వీస్ రికార్డు, చేసిన పనిపై సమగ్ర మదింపు చేసిన తర్వాత 2025-2026 ప్యానెల్ సంవత్సరానికి అదనపు పోలీస్ సూపరింటెండెంట్ (సివిల్)గా వ్యవహరించడానికి అర్హులైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) ప్యానెల్‌ను ఆమోదించింది.

అదేవిధంగా 2025-2026 ప్యానెల్ సంవత్సరానికి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)గా వ్యవహరించడానికి అర్హులైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)ల ప్యానెల్ తయారీ కోసం ప్రతిపాదనలు డీజీపీ కార్యాలయం నుంచి వెళ్లాయి.

స్క్రీనింగ్ కమిటీ సీనియారిటీ జాబితాలోని 75 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్)ల ఏసీఆర్లు, సంబంధిత రికార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను, క్రమశిక్షణా కేసులతో సహా పరిశీలించి, వారి సర్వీస్ రికార్డు, చేసిన పనిపై సమగ్ర అంచనా వేసిన తర్వాత, 2025-26 ప్యానెల్ సంవత్సరానికి అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) కేటగిరీకి పదోన్నతి కోసం క్రింది పేర్లను అర్హులుగా చేర్చాలని సిఫార్సు చేసింది.

ప్రభుత్వ పరిశీలన అనంతరం స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది. అలాగే 2025-2026 ప్యానెల్ సంవత్సరానికి గాను, అదనపు కమాండెంట్ కేటగిరీకి పదోన్నతి పొందేందుకు అర్హులైన అసిస్టెంట్ కమాండెంట్ల ప్యానెల్‌ను సిద్ధం చేయడం కోసం ప్రతిపాదనలు వెళ్లాయి.

Leave a Reply