17th May 2026 | తిరుమల సమాచారం..

17th May 2026 | తిరుమల సమాచారం..

17th May 2026 | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల నిరీక్షణ.. శనివారం (16-05-2026) శ్రీవారిని మొత్తం 90,011 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,083 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని వేచివుండే కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 16 నుంచి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లతో తిరుమలకు రావాలని సూచించారు.

Leave a Reply