CongressSeniorLeader | కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

CongressSeniorLeader | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక తుపాను వచ్చే పరిస్థితి నెలకొంటోందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ విధానాల వల్ల పేదలపై మరింత భారం పడుతోందని ఆరోపించారు.
సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలిలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్య ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్నారు.
సంక్షోభ సమయాల్లో విదేశాలకు వెళ్లొద్దని చెప్పే ప్రధాని మోడీ.. తాను మాత్రం ప్రపంచ దేశాల పర్యటనల్లో బిజీగా ఉన్నారని రాహుల్ విమర్శించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
