accident | రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ…
accident | రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీ…
accident | నకరికల్లు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని త్రిపురాపురం గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ షరీఫ్ (34), తండ్రి జాన్ వలి, తన ద్విచక్ర వాహనంపై సంతమాగులూరు అడ్డరోడ్డు నుండి కొండమోడు వైపు వెళ్తున్నాడు. త్రిపురాపురం గ్రామ శివారులోకి రాగానే వాహనం అతివేగంగా ఉండటంతో అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో మస్తాన్ షరీఫ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావమై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు సమాచారం. అతివేగం వల్ల జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది
click here to read more : 20kilograms | నేపాలీ దంపతుల అరెస్ట్
