ఎనికెపాడులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

ఎనికెపాడులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర
అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతి మండలం ఎనికపాడు లో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు,అధికారులు, గ్రామస్థులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి గ్రామ రోడ్లను ఊడ్చి పరిశుభ్రతపైఅవగాహనకల్పించారు.గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవం తమైన జీవితం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. .
పరిశుభ్రత వల్ల వ్యాధులు దూరంగా ఉంటాయని, ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే అలవాటు పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో టీ పార్వతి, మాజీ సర్పంచ్, నరుకులపాడు సొసైటీ చైర్పర్సన్ భాష్యం జగదీష్, మండల టిడిపి అధ్యక్షులు మంచినేని రాజా, నాయకులు భాష్యం అమర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామాభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అభిప్రాయపడ్డారు.
