Redbird | సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్.. పైలట్‌కు గాయాలు

Redbird | సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్.. పైలట్‌కు గాయాలు

Redbird | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌ : మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతిలో ఇవాళ ఉదయం శిక్షణ విమానం కూలిన ఘటన కలకలం రేపింది. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన ఈ విమానం సాంకేతిక లోపం కారణంగా బారామతి విమానాశ్రయం సమీపంలోని గోజుబావి గ్రామం వద్ద క్రాష్ ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్‌కు గాయాలైనట్లు సమాచారం. స్థానికులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పైలట్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

విమానం కూలడానికి గల కారణాలపై పోలీసులు, విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే గోజుబావి గ్రామం వద్ద గతంలో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన విషయం మరోసారి చర్చనీయాంశమైంది.

Leave a Reply