ప్రజల మానసిక వికాసానికి కళలు ఎంతో దోహదపడుతాయి..

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; ప్రజల మానసిక వికాసానికి కళలు ఎంతో దోహద పడుతాయని మండలం విద్యాధికారి బాలు నాయక్ అన్నారు. విద్యా వారోత్సవాలలో భాగంగా స్థానిక పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళల అభ్యసకు భాల్యమే సరైనది అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కళలతో ముడిపడి ఉన్నాయని, కళల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహాన అవసరం అన్నారు. అనంతరం వర్ధమాన కళాకారుడు ఆర్ సుచిర్ కీబోర్డ్, గిటా వాయిధ్య పరికరాలతో నిర్వహించిన సంగీతం విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో నేరేడుచర్ల, పెంచికల్ దిన్నె పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఎల్. శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు కొణతం వెంకటరెడ్డి, కట్టా శ్రీనివాస రెడ్డి, డాన్స్ మాస్టర్ రాజు, సరస్వతి ఉన్నారు.