కామాక్షి అమ్మవారికి కనకదుర్గమ్మ పట్టువస్త్రాలు..

కామాక్షి అమ్మవారికి కనకదుర్గమ్మ పట్టువస్త్రాలు..
సాంప్రదాయబద్ధంగా సమర్పణ…
పట్టు వస్త్రాలు అందజేసిన దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ..
ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంకు శనివారం సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలను ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతినిధులకు దేవస్థాన మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం అర్చక బృందం కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు.

