11 o’clock | ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు
11 o’clock | నరసన్నపేట, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు తామరాపల్లి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

హెలిప్యాడ్ వద్ద కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
అలాగే ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, గౌతు శిరీష, బెందాలం అశోక్, మామిడి గోవిందరావు, ఎన్. ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
