వీధి కుక్కల దాడి.. బాలుడికి గాయాలు

వీధి కుక్కల దాడి.. బాలుడికి గాయాలు

  • చెవిని కొరికేసి.. ఒళ్లంతా గాయపరచి
  • పార్కులో ఆడు కుంటుండగా పదుల సంఖ్యలో దాడి
  • విశాఖ నగరంలోని 86వ వార్డులో ఘటన

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో ; విశాఖ మహానగరంలోని పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు సామూహిక దాడి చేశాయి.ఒళ్లంతా గాయపరచి, చెవిని కొరికేశాయి. వాటి దాడిని తట్టుకోలేక పిల్లాడు ఏడుస్తుండడంతో స్థానికులు వచ్చి రక్షించారు. జీవీఎంసీ 86వ వార్డులోని స్థానిక ఆరోగ్య ప్రాథమిక కేంద్రంలో పనిచేస్తున్న పనిచేస్తున్న జాయూస్.. వుడా ఫేజ్-2లో ఇద్దరు కుమార్తెలు, కుమా రుడితో కలిసి జీవిస్తున్నారు.

ఆమె శుక్రవారం విధులకు వెళ్లగా కుమార్తెలు, కుమారుడు ఇంట్లో ఉన్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో అక్కలు ఇద్దరూ నిద్రిస్తుండగా, మోక్షరాజు (4) ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న వీధికుక్కలు కొద్దిసేపటికి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. బాలుడిని తీవ్రంగా గాయపరిచి, చెవిని కొరికేశాయి బాలుడు పెద్దగా ఏడుస్తుండడంతో స్థానికులు వచ్చి రక్షించి తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె హుటాహుటిన వచ్చి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడుకు చికిత్స కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు వీధి కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని వేడు కుంటున్నారు.

Leave a Reply