4 Dead Kovvuru : నలుగురు అక్కడిక్కడే Andhra Prabha Spot News
4 Dead Kovvuru : నలుగురు అక్కడిక్కడే Andhra Prabha Spot News
- మరో ఇద్దరి పరిస్థితి విషయం
- కొవ్వూరులో దుర్ఘటన
- ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన ట్రిప్పర్
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
- రూ.4 లక్షల పరిహారం ప్రకటన
- మంత్రి నారాయణ విచారం
(ఆంధ్రప్రభ, కాకినాడ _
4 Dead Kovvuru : కాకినాడ జిల్లా కొవ్యూరు సమీసంలో… శనివారం తెల్లవారుజామున ఓ భారీ ట్రిప్పర్ నలుగురు ఉపాధి హామీ కూలీలను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా మారింది. తెల్లవారక ముందే పొట్టచేత పట్టుకుని పనికి బయలు దేరిన ఈ నిరుపేద మహిళలు ట్రిప్పరు చక్రాల కింద ఛిధ్రమైన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం, కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం 2026 మే 16, శనివారం ఉదయం 5.30 గంటలకు ఈ దర్ఘుటన చోటుచేసుకుంది. చిడిగ గ్రామానికి చెందిన మహిళా కూలీలు . ఉపాధి హామీ పథకం (MGNREGA) పనుల్లో పాల్గొనడానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. కాకినాడ పోర్టు వైపు వెళ్తున్న ఫ్లైయాష్ ట్రిప్పర్ అతి వేగంగా దూసుకు రాగా..నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. మరో ఇదక్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా మారింది. వాసంశెట్టి సత్యవతి(60), పాలిక కృష్ణవేణి(38), కాదా చిట్టెమ్మ(45), చెల్లూరి అన్నవరం (45) అనే మహిళా కూలీలు మృతి చెందారు. మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణి. తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రిప్పర్ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ ఐ వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
4 Dead Kovvuru : డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ రూరల్ మండలం పరిధిలో పని ప్రదేశంలో రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా ఉపాధి శ్రామికులు మృతి చెందారన్న విషయం తెలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతికి గురయ్యాను. చీడిగ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళా శ్రామికులు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలియజేశారు. పని ప్రదేశంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలచి వేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని కాకినాడ జిల్లా యంత్రాంగానికి సూచించాను. వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తాం. మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన పరిహారం రూ. 4 లక్షలు త్వరితగతిన అందించే ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 2 లక్షలు, పి.ఎం. సురక్ష యోజన, పి.ఎం. జీవన్ జ్యోతి యోజన కింద వచ్చే బీమా మొత్తాన్ని వీరికి అందిస్తాం. రహదారుల వెంబడి పని ప్రదేశాల్లో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాం. జాతీయ రహదారుల వెంబడి, వాహనాలు వేగంగా వచ్చే బైపాస్ రోడ్ల వెంబడి, ట్రాఫిక్ రద్దీ ఉండే రహదారుల వెంబడి ఉపాధి పనులు జరుగుతున్న సమయంలో వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అదేశించాం.
4 Dead Kovvuru : మంత్రి నారాయణ తక్షణ స్పందన
కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ఇంచార్జి మంత్రి నారాయణ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్న నలుగురు మహిళలు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరం అని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
