రజక కార్పొరేషన్ చైర్మన్ నియామకం పట్ల హర్షం
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం రజకులు గుర్తించి కార్పొరేషన్ ఛైర్మెన్,మహిళ కమిషన్ సభ్యురాలిగా చాకలి ఆడ బిడ్డను నియమించడం హర్షణీయమని రజక సంఘం జిల్లా నాయకులు ధర్మరాజుల వెంకట నారాయణ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా నాయకులు ధర్మరాజుల వెంకట నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ పదవుల్లో రజకుల సముచితమైన స్థానం కల్పించారన్నారు.
తెలంగాణ వాషర్మెన్(రజక) కో-అపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా దాసరిరాజు అజయ్ కుమార్,రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా చిట్యాల సీత ఐలమ్మ నియమించారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కులానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంకట నారాయణ అభినందించారు. చాకలి కులాన్ని దోబీ గా మార్చటం,నామినేటెడ్ పదవులు కేటాయించటం కులానికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని ధర్మరాజుల అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా ఉద్యమించిన మహిళ చాకలి ఐలమ్మ వారసురాలుగా చిట్యాల సీత ఐలమ్మను మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి అర్హురాలని తెలిపారు.సీతమ్మ ఐలమ్మకు వారసురాలు కాదు అని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. శాసన మండలిలో ఇద్దరు రజక కులానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారని,ఒకరికి మంత్రి పదవి కేటాయించాలని ధర్మరాజుల వెంకట రమణ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా నాయకులు ముదిగొండ వెంకటప్పయ్య, కొండెం వీరభద్రంగడేపెళ్లి శ్రీను,ముత్తయ్య,ధర్మరాజుల సత్యనారాయణ,నిమ్మటూరి రామయ్య,నిమ్మటూరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
