20samples | 65 మంది మృతి..
20samples | 65 మంది మృతి..
20samples | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు 65 మంది మరణించగా, సుమారు 246 అనుమానిత కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాలతో ఆఫ్రికా దేశాల్లో ఆందోళన నెలకొంది.
ఆఫ్రికా వ్యాధి నియంత్రణ అండ్ నివారణ కేంద్రాలు సేకరించిన 20 శాంపిల్స్‌లో 13కు ఎబోలా వైరస్ సోకినట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ముఖ్యంగా ఇటూరి ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించినట్లు సమాచారం.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా కాంగో సరిహద్దు దేశాలైన ఉగాండా, దక్షిణ సూడాన్ లను ఆఫ్రికా సీడీసీ అప్రమత్తం చేసింది. 1976లో ప్రపంచంలో తొలి ఎబోలా కేసు కాంగోలోనే నమోదైన విషయం తెలిసిందే.
