Ramcharan | పెద్ది మూవీకి భారీ షాక్…

Ramcharan | పెద్ది మూవీకి భారీ షాక్…

Ramcharan | ఎగ్జిబిటర్స్ – ప్రొడ్యూసర్స్ మధ్య వివాదం ముదురుతోంది
పర్సంటేజ్ సిస్టమ్ పై థియేటర్ యజమానుల డిమాండ్
పెద్ది సినిమాను అడ్డుకుంటారా అనే చర్చ
ఇండస్ట్రీలో దాసరి లేని లోటు మరోసారి చర్చనీయాంశం

Ramcharan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ, క్రేజీ మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. మార్చి 27న విడుదల (Release) కావాల్సిన పెద్ది.. ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటుకుని జూన్ 4న భారీ స్థాయిలో థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఎగ్జిబిటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి మధ్య వివాదం నడుస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిబిటర్స్ అంతా ఏకమై పెద్ది సినిమాని ఒక్క థియేటర్ లో కూడా రిలీజ్ కానివ్వమని అంటున్నారనే వార్త లీక్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అసలు ఏం జరిగింది..?

Ramcharan | ఎగ్జిబిటర్స్ వెర్సెస్ ప్రొడ్యూసర్స్..

థియేటర్స్ ను పర్సంటేజ్ సిస్టమ్ లో రన్ చేయాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్. దీనికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. ఇక అక్కడ నుంచి వివాదం ముదిరింది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకునే వారుకు వెళ్లింది. ప్రెస్ మీటులు పెట్టి మరీ.. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ (Producers) విమర్శలు చేసుకోవడంతో ఈ వివాదం ఎటు వైపు టర్న్ తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఎగ్జిబిటర్స్ ఎందుకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారంటే.. స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ బాగుంటాయి. అందుచేత పర్సంటేజ్ సిస్టమ్ అయితే.. ఎక్కువ అమౌంట్ వస్తుంది. అదే రెంటల్ సిస్టమ్ అయితే.. ఎప్పుడూ ఓకే రేటు ఉంటుంది కానీ.. పెద్దగా ఎగ్జిబిటర్స్ కు కలిసొచ్చేది ఏముండదు. అందుకనే పర్సంటేజ్ సిస్టమ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.

Ramcharan

Ramcharan | పెద్దిని అడ్డుకుంటారా..?

అయితే.. నిర్మాతలు మా సమస్యలు మాకున్నాయి. ఇప్పటికిప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఎలా కూర్చొని మాట్లాడుకుని.. కొంత టైమ్ తీసుకుని అప్పుడు పర్సంటేజ్ విధానం అమలు చేద్దామంటుంటే.. ఎగ్జిబిటర్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే పెద్ది సినిమాని ఒక్క థియేటర్లో కూడా వేయమని ఎగ్జిబిటర్స్ చెప్పడం అటు అభిమానుల్లోనూ,(Fans) ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి గారు సమస్యను పరిష్కరించేవారు. కానీ.. ఆయన లేని లోటు కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద అంటే.. కొంత మంది అంగీకరిస్తారు.. కొంత మంది అంతగా అంగీకరించరు. ఆయన కూడా ఇండస్ట్రీలో ఒక్కడిని తప్పితే.. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవాలని లేదు అని చాలా సార్లు చెప్పారు. మరి.. ఈ వివాదం ఎటు వైపు వెళుతుందో..? ఏం జరగనుందో చూడాలి.

Ramcharan

CLICK HERE TO READ Megastar | అసలు నిజం ఇదే..

CLICK HERE TO READ MORE