21june | వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
21june | వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
21june | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై త్వరలో పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు.
నీట్ రీ ఎగ్జామ్‌ను జూన్ 21న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మరోసారి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. పరీక్ష రాసే సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచినట్లు చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చని, అడ్మిట్ కార్డులను జూన్ 14న విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ప్రశ్నపత్రం లీక్ ఒక సామాజిక రుగ్మతగా మారిందని, దీనిపై రాజకీయాలు చేయవద్దని ధర్మేంద్ర ప్రధాన్ విజ్ఞప్తి చేశారు. పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు.
