Yousufguda | ఏసీ నుంచి మంటలు.. ఫ్లాట్‌లో సామగ్రి దగ్ధం

Yousufguda | ఏసీ నుంచి మంటలు.. ఫ్లాట్‌లో సామగ్రి దగ్ధం

Yousufguda |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశ్వవిహార్ ల్యాండ్‌మార్క్ కన్‌స్ట్రక్షన్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

ఫ్లాట్‌లోని ఏసీ నుంచి మంటలు రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్‌లో ఇద్దరు వృద్ధులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.