అట్టహాసంగా బడిబాట
అట్టహాసంగా బడిబాట
చెన్నూర్ (కోటపెల్లి ), ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండల కేంద్రంలోనీ తెలంగాణ మోడల్ స్కూల్ లో గురువారం విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. తోలుత ర్యాలీ నిర్వహించి కొత్త అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. 2025- 26 విద్యాసంవత్సరం లో 90 శాతంకు పైగా పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు మహేష్, సురేందర్, శంశోద్దిన్, రాజశేఖర్, వెంకట రమణ, సంజీవ్ లకు డైరెక్టరేట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా మంజూరైన ప్రశంసా పత్రాలను ప్రిన్సిపాల్ రాజశేఖర్ అందించి అభినందిచారు. అనంతరం పేరెంట్ టీచర్స్ సమావేశం నిర్వహించి పాఠశాల ప్రగతి పై వివరించి కొత్త అడ్మిషన్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
